కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్‌ చేయలేం

Bheeshma movie small video release - Sakshi

కనుల ముందు కనిపిస్తున్న ప్రేమ చెంతకు చేరడం లేదని తెగ ఫీలైపోతున్నారు నితిన్‌. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పటికే ఓ పాటను అక్కడ చిత్రీకరించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు.

ఈ టీజర్‌లో ‘నా లవ్‌ కూడా విజయ్‌ మాల్యాలాంటిది రా... కనిపిస్తుంటుంది కానీ క్యాచ్‌ చేయలేం’ అని నితిన్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ ఒక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. కథనం వినోదాత్మకంగా సాగుతుంది. యువతీ, యువకులకు రష్మిక, నితిన్‌ క్యారెక్టర్లు కనెక్ట్‌ అవుతాయి’’ అన్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top