
రష్మికా మందన్నా, నితిన్
‘భీష్మ’ టీమ్‌కి బై బై చెప్పేశారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు నితిన్. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఆదివారం ఈ చిత్రంలోని ‘వాటే వాటే వాటే బ్యూటీ...’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ధనుంజయ్, అమల చేబోలు ఈ పాటను ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ‘భీష్మ’ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.