పంచెకట్టు... అదిరేట్టు | Bharath Ane Nenu Ugadi poster: Mahesh Babu's Panche Kattu avatar goes viral | Sakshi
Sakshi News home page

పంచెకట్టు... అదిరేట్టు

Mar 19 2018 12:33 AM | Updated on Jul 25 2018 2:35 PM

Bharath Ane Nenu Ugadi poster: Mahesh Babu's Panche Kattu avatar goes viral - Sakshi

స్వచ్ఛమైన తెలుగుదనానికి అచ్చ తెలుగు యువకుడిలా మహేశ్‌బాబు లుక్‌ అదిరిపోయింది. సంప్రదాయానికి కేరాఫ్‌ అడ్రస్‌లా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైనెమెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్‌ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక. సీయం భరత్‌చంద్ర పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మహేశ్‌బాబు సంప్రదాయ లుక్‌లో ఉన్న ఫొటోను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.

‘‘ఉగాది పండగ కళ ఉట్టిపడే పంచెకట్టుతో ఉన్న మహేశ్‌బాబు లుక్‌కి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రాజు సుందరం నేతృత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెంపుల్‌ సెట్‌లో వంద మంది డ్యాన్సర్లు, వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్‌గా పాటను తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 25న స్పెయిన్‌లో కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. సినిమాను ఏప్రిల్‌ 20న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డీవీవీ దానయ్య. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement