తీపి కబురు

Bharath Ane Nenu teaser for Ugadi?  - Sakshi

కారం, తీపి, వగరు, పులుపు, ఉప్పు, చేదు అనే షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి పిచ్చ టేస్టీగా ఉంటుంది. అలాగే ఓ ఫైట్, సాంగ్, సీన్, డైలాగ్, రొమాన్స్, ఎమోషన్‌ కలగలిపి ఉన్న ఓ సూపర్‌ టీజర్‌ను రెడీ చేస్తోందట భరత్‌ అండ్‌ టీమ్‌. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక. సీయం భరత్‌ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా భరత్‌ ఫస్ట్‌ ఓత్‌ అండ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాదికి టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. టీజర్‌ రిలీజ్‌ వేడుక ఫ్యాన్స్‌ సమక్షంలో జరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు ఇంతకంటే తీపి కబురు ఏముంటుంది. ఈ నెల 25 నుంచి 28 వరకూ జరిగే షెడ్యూల్‌లో మహేశ్‌బాబు పాల్గొంటారు. ఆ తర్వాత లండన్‌లో ఓ షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. సినిమా ఎంటైర్‌ షూటింగ్‌ మార్చి 27కల్లా కంప్లీట్‌ చేసేలా చిత్రబృందం ప్లాన్‌ చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top