‘భాగమతి’కి భారీ వసూళ్లు | Bhaagamathie first day box office collection | Sakshi
Sakshi News home page

‘భాగమతి’కి భారీ వసూళ్లు

Jan 28 2018 9:42 AM | Updated on Jan 28 2018 9:43 AM

Bhaagamathie first day box office collection - Sakshi

‘భాగమతి’లో అనుష్క

సాక్షి, హైదరాబాద్‌: అనుష్క తాజాచిత్రం ‘భాగమతి’ భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది. మొదటిరోజు మొత్తం రూ. 12 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు రావడంతో మార్నింగ్‌ షోల తర్వాత ప్రేక్షకాదరణ మరింత పెరిగింది. దీంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. తమ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ‘భాగమతి’ చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ఈ సినిమాకు జి.అశోక్‌ దర్శకత్వం వహించారు. అనుష్కకు జోడిగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ నటించాడు. తమన్‌ సంగీతం అందించాడు.

Advertisement
 
Advertisement
Advertisement