మంచి కథ.. హిట్‌ గ్యారంటీ – రాజేంద్రప్రసాద్‌ | Bevars movie teaser release | Sakshi
Sakshi News home page

మంచి కథ.. హిట్‌ గ్యారంటీ – రాజేంద్రప్రసాద్‌

Dec 25 2017 12:08 AM | Updated on Dec 25 2017 12:08 AM

Bevars movie teaser release - Sakshi

రాజేంద్రప్రసాద్, సంజోష్, హర్షిత

‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్‌ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే అనే కథాంశంతో దర్శకుడు రమేశ్‌ ‘బేవర్స్‌’ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రమిది. నా కెరీర్లో ఎక్కువ పారలల్‌ సినిమాలు చేశా. మళ్లీ ఇప్పుడు మరో సూపర్‌ హిట్‌ సినిమా వస్తోంది. ఈ సినిమా నా కెరీర్‌లో మరో మంచి చిత్రంగా నిలుస్తుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రలో రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో పొన్నాల చందు, ఎమ్‌.అరవింద్‌ నిర్మించిన ‘బేవర్స్‌’ టీజర్‌ రిలీజ్‌ చేశారు. రమేష్‌ చెప్పాల మాట్లాడుతూ– ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్‌’ సినిమా రూపొందిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందా. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ గారు చేసిన పాత్ర ఇప్పటివరకూ ఆయన వేరే సినిమాల్లో చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement