సరికొత్తగా... | Bellamkonda Srinivas new movie started in hyderabad | Sakshi
Sakshi News home page

సరికొత్తగా...

Jun 13 2017 11:32 PM | Updated on Aug 3 2019 12:45 PM

సరికొత్తగా... - Sakshi

సరికొత్తగా...

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ నామా నిర్మించనున్న

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ నామా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఓ వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీనివాస్‌ను సరికొత్తగా చూపించనున్నా. బాలీవుడ్‌ హీరోయిన్‌ను శ్రీనివాస్‌ సరసన సెలక్ట్‌ చేస్తాం. ఒక మేజర్‌ షెడ్యూల్‌ను ఫారిన్‌లో ప్లాన్‌ చేస్తున్నాం.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత పీటర్‌ హెయిన్స్‌ ఫైట్స్‌ సమకూర్చుతున్నారు’’ అన్నారు. ‘‘శ్రీవాస్‌ కథ బాగా నచ్చింది. శ్రీనివాస్‌ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పుడు మా కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం సంతోషంగా ఉంది. శ్రీనివాస్, శ్రీవాస్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది’’ అన్నారు నిర్మాత. జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్‌ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా.

Advertisement
 
Advertisement
Advertisement