ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్ | Befikre day 1 collections are good | Sakshi
Sakshi News home page

ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్

Dec 10 2016 5:12 PM | Updated on Sep 4 2017 10:23 PM

ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్

ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్

రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'.

రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'. దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై భారీ వసూళ్లు వసూలుచేస్తోంది. రిలీజైన తొలిరోజు మొత్తం రూ. 10.36 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల కిందట ఆ మూవీ యూనిట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే భారీగా వీక్షించారు.

అందులోనూ మూవీలో రణవీర్, వాణీల లిప్ లాక్ సీన్లు ఉండటం మూవీకి కలిసొస్తుందని నటీనటులతో పాటు టెక్నిషియన్లు భావించారు. వారు అనుకున్నట్లుగానే మూవీకి మంచి ఓపెనింగ్ లభించిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 45 శాతం మార్నింగ్ షోలకే టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారత్ లో 2100 స్క్రీన్లు, విదేశాలలో 800 స్క్రీన్లలో విడుదల చేశారు. నోట్ల రద్దుతో సతమతమవుతున‍్నా ట్రైలర్ చూసిన వాళ్లు కచ్చితంగా థియేటర్లకు రావడం ఖాయమని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఎన్నో హాట్ లిప్ లాక్స్ ఉన్నా మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించడం కలిసొచ్చిందని చెప్పవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement