ఇలియానా బ్యూటీ సీక్రెట్స్ | Beauty secrets of Ileana D'cruz | Sakshi
Sakshi News home page

ఇలియానా బ్యూటీ సీక్రెట్స్

Jun 4 2015 11:29 PM | Updated on Sep 3 2017 3:13 AM

ఇలియానా బ్యూటీ సీక్రెట్స్

ఇలియానా బ్యూటీ సీక్రెట్స్

సౌందర్య సంరక్షణ అనేది ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. గత కొన్నాళ్లుగా మనం వేసవిని చూస్తున్నాం.

 సౌందర్య సంరక్షణ అనేది ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. గత కొన్నాళ్లుగా మనం వేసవిని చూస్తున్నాం. ఈ వేసవికి తగ్గట్టుగా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. వేసవి అనగానే నాకో విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఈ భయమంతా నా స్కిన్ గురించే. నాది చాలా సున్నితమైన చర్మం. కొంచెం ఎండలోకి వెళ్లినా కందిపోతుంది. అందుకే సమ్మర్‌లో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికెళ్లే ప్రసక్తే లేదు.

ఈ సీజన్‌లో జుట్టు బాగా ఎండిపోయినట్టుగా అవుతుంది. అందుకనే వారంలో రెండు సార్లయినా తప్పనిసరిగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత మంచి షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను,

సమ్మర్‌లో అవుట్‌డోర్ షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటాను. చల్లని ప్రదేశంలో షూటింగ్ అంటే భలే హాయిగా ఉంటుంది.

వేసవిలో మేకప్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్స్ ఉంటే మేకప్ తప్పదు. లేనప్పుడు అస్సలు మేకప్ జోలికి వెళ్లను.

మామూలుగా ఉదయం లేవగానే వేడి నీళ్లల్లో కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతాను. ఈ సీజన్‌లో కూడా అలాగే చేస్తాను.

కాకపోతే ఎక్కువగా ద్రవపదార్థాలే తీసుకుంటాను. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు ఇలా రెండు గంటలకొకసారి ఏదో ఒకటి తాగుతాను.

సమ్మర్ వస్తోందంటే చాలు ప్రత్యేకంగా కాటన్ దుస్తులు కొనుక్కుంటాను. ఈ సీజన్‌లో అవే సౌకర్యంగా ఉంటాయి.

వేసవిలో ఉదయం 9గంటలకు ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత స్విమ్మింగ్ చేస్తాను. సమ్మర్‌లో చల్లని నీళ్లలో ఈతకొడుతుంటే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది.

ఎవరికైనా నా సలహా ఒకటే అవసరం అయితేనే ఎండలో బయటకు వెళ్లండి, లేకపోతే కూలింగ్ గ్లాసెస్, టోపీ పెట్టుకుని వేళ్తే ఎండ నుంచి రక్షణగా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement