ఓ బేవర్స్‌ కుర్రాడి కథ | Beach Road Chetan teaser launch | Sakshi
Sakshi News home page

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

Sep 8 2019 5:38 AM | Updated on Sep 8 2019 5:38 AM

Beach Road Chetan teaser launch - Sakshi

తేజా రెడ్డి, చేతన్‌ మద్దినేని

‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ ర్యాంకు రాజు’ చిత్రాల ఫేమ్‌ చేతన్‌ మద్దినేని హీరోగా నటిస్తూ, స్వీయదర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’. తేజారెడ్డి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. చేతన్‌ మాట్లాడుతూ– ‘‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ ర్యాంకు రాజు’ చిత్రాలు విజయం సాధించి హీరోగా నాకు పేరు తెచ్చాయి. కానీ చేతన్‌ మద్దినేని అనేంతగా గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు కోసమే ప్రయత్నిస్తున్నాను. ఆ మూడు సినిమాల తర్వాత చాలా కథలు విన్నాను.

ఏదీ నచ్చలేదు. అందుకే సొంతగా కథ రాసుకున్నాను. బీచ్‌లో బేవర్స్‌గా తిరిగే చేతన్‌ అనే యువకుని కథ ఇది. సినిమా అంతా వైజాగ్‌లో జరుగుతుంది. ఇందులో చేతన్‌ అనే పాత్ర చేశాను. వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు. ‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇది. అవకాశం ఇచ్చిన చేతన్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు తేజారెడ్డి. ‘‘చిన్న సినిమాగా స్టార్ట్‌ చేసినా  మేం పెద్ద సినిమా చేశాం. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు కెమెరామన్‌ నిశాంత్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement