బందోబస్త్‌కు సిద్ధం | bandobast audio launch by kamal haasan | Sakshi
Sakshi News home page

బందోబస్త్‌కు సిద్ధం

Aug 5 2019 3:38 AM | Updated on Aug 5 2019 3:38 AM

bandobast audio launch by kamal haasan - Sakshi

దేశాన్ని రక్షించే కమాండోగా సూర్య నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కప్పాన్‌’. తెలుగులో ‘బందోబస్త్‌’. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. భారత ప్రధానిగా మోహన్‌లాల్‌ నటించారు. సయేషా కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘సూర్య డిఫరెంట్‌ గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తారు.

ఇటీవలే తమిళంలో రజనీకాంత్‌గారు ఆడియో రిలీజ్‌ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే తెలుగు పాటలను విడుదల చేసి, గ్రాండ్‌గా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఆర్య, బొమన్‌ ఇరానీ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారీస్‌  జైరాజ్‌. కెమెరా: ఎం.ఎస్‌. ప్రభు.

Advertisement
 
Advertisement
Advertisement