కుంభకోణంలో డిష్యుం డిష్యుం | balayya's 102nd shoot at kumbakonam | Sakshi
Sakshi News home page

కుంభకోణంలో డిష్యుం డిష్యుం

Sep 12 2017 2:09 AM | Updated on Aug 29 2018 1:59 PM

కుంభకోణంలో డిష్యుం డిష్యుం - Sakshi

కుంభకోణంలో డిష్యుం డిష్యుం

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కుంభకోణంలో జరుగుతోంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కుంభకోణంలో జరుగుతోంది. సి.కె. ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, నటాషా దోషి కథానాయికలు. సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణగారి 102వ చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ సినిమా రూపొందుతోంది.

ఎం. రత్నం మంచి కథ అందించారు. ఆర్‌.ఎఫ్‌.సి.లో 30 రోజులు చిత్రీకరణ ముగించుకుని, కుంభకోణంలో మొదలుపెట్టాం. ఆదివారం బాలకృష్ణ సెట్లో అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో  కీలక సన్నివేశాలతో పాటు, పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తాం’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్‌ భట్, సహ–నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: వరుణ్‌–తేజ.

Advertisement
 
Advertisement
Advertisement