నందమూరి అభిమానులకు దసరా కానుక | Balakrishnas Gautamiputra Satakarni Release Date | Sakshi
Sakshi News home page

నందమూరి అభిమానులకు దసరా కానుక

Sep 28 2016 11:18 AM | Updated on Sep 4 2017 3:24 PM

నందమూరి అభిమానులకు దసరా కానుక

నందమూరి అభిమానులకు దసరా కానుక

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. ఇది బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్...

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. ఇది బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 సంక్రాంతి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ ఫోస్టర్లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ దసరా కానుకగా ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్య యుద్ధవీరుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హేమామాలిని బాలకృష్ణ తల్లిగా నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కంచె ఫేం చింతరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement