డ్రీమ్గర్ల్కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్ | Balakrishna special gift for dream girl | Sakshi
Sakshi News home page

డ్రీమ్గర్ల్కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్

Sep 3 2016 1:44 PM | Updated on Aug 29 2018 1:59 PM

డ్రీమ్గర్ల్కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్ - Sakshi

డ్రీమ్గర్ల్కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్ తో...

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమాలో కీలకమైన శాతకర్ణి తల్లి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినిని తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ విజయం లాంటి తెలుగు సినిమాల్లో మాత్రమే నటించిన హేమామాలిని మరోసారి నందమూరి హీరో కోసమే తెలుగు సినిమాను అంగీకరించారు.

ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లోని పురాతన కోటలో ఈ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లో పాల్గొంటున్న హేమకు బాలయ్య స్పెషల్ గిఫ్ట్ను అందించాడట. తను ప్రతినిధ్యం వహిస్తున్న హిందూపురం లో నేసిన లేపాక్షి చీరను హేమామాలినికి గిఫ్ట్ ఇచ్చాడు. గమ్యం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కంచె సినిమాకు సంగీతం అందించిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement