'ఉస్తాద్'గా బాలయ్య..! | Balakrishna, Puri Jagannadh Movie Titled As Ustad | Sakshi
Sakshi News home page

'ఉస్తాద్'గా బాలయ్య..!

Mar 29 2017 7:35 AM | Updated on Aug 29 2018 1:59 PM

'ఉస్తాద్'గా బాలయ్య..! - Sakshi

'ఉస్తాద్'గా బాలయ్య..!

తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, 101వ చిత్రంగా పూరి జగన్నాథ్

తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, 101వ చిత్రంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హీరోయిజాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించే పూరి జగన్నాథ్, బాలకృష్ణను స్టైలిష్ డాన్గా చూపించబోతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రోగ్ రిలీజ్ తరువాత రెండో షెడ్యూల్కు రెడీ అవుతోంది.

ఇటీవల ఈ సినిమాకు టపోరి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే చిత్రయూనిట్ ఈ టైటిల్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరో టైటిల్ తెర మీదకు వచ్చింది. బాలయ్య డాన్గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఉస్తాద్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. బాలకృష్ణ ఇమేజ్, క్యారెక్టరైజేషన్ ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నాడట పూరి. బాలకృష్ణతో పాటు యూనిట్ సభ్యులకు కూడా ఈ టైటిల్ నచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది పూరి టీం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement