పూరీ సినిమాకు బాలయ్య ముహూర్తం

Puri Jagannadh Mehbooba

వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన స్పీడు మాత్రం తగ్గించటం లేదు. ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సినిమాతో పరవాలేదనిపించిన పూరి, తన తనయుడ్ని రీ లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న మెహబూబా సినిమాతో ఆకాష్ పూరిని కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ ను బుధవారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ముహూర్తానికి సంబంధించి చిత్రయూనిట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ గారే ఈ ముహూర్తాన్ని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top