బాలయ్య కొత్త సినిమా మొదలైంది..! | Bala krishna New Movie Opening | Sakshi
Sakshi News home page

బాలయ్య కొత్త సినిమా మొదలైంది..!

Aug 3 2017 11:07 AM | Updated on Sep 17 2017 5:07 PM

బాలయ్య కొత్త సినిమా మొదలైంది..!

బాలయ్య కొత్త సినిమా మొదలైంది..!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిలో

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిలో ఘనవిజయం సాధించిన బాలయ్య త్వరలో పైసా వసూల్ సినిమాతో మరో డిఫరెంట్ లుక్ లో రెడీ అవుతున్నాడు. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా గురువారం (03-08-2017) ఉదయం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.

దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణపై చిత్రీకరించిన తొలిషాట్ కు క్లాప్ కొట్టారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి కళ్యాణ్ నిర్మిస్తుంగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement