'బాబు బంగారం'కి డేట్ దొరికింది | Babu Bangaram To Release on August 12 | Sakshi
Sakshi News home page

'బాబు బంగారం'కి డేట్ దొరికింది

Jul 15 2016 2:17 PM | Updated on Sep 4 2017 4:56 AM

'బాబు బంగారం'కి డేట్ దొరికింది

'బాబు బంగారం'కి డేట్ దొరికింది

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా ఆలస్య కావటం వెంకటేష్ సినిమాకు కలిసొచ్చింది. తొలిసారిగా మారుతి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా...

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా ఆలస్య కావటం వెంకటేష్ సినిమాకు కలిసొచ్చింది. తొలిసారిగా మారుతి ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా బాబు బంగారం. వెంకటేష్, నయనతారలు జంటగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్పై చిత్రయూనిట్ డైలమాలో ఉన్నారు. కబాలి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటం ఆలస్యం కావటంతో బాబు బంగారం రిలీజ్ డైలామాలో పడింది.

ఫైనల్గా జూలై 15న సినిమా రిలీజ్ చేద్దామని భావించినా.., వారం గ్యాప్లో కబాలి రిలీజ్ ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆగస్టులో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ ఉండటంతో సెప్టెంబర్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అనుకోకుండా జనతాగ్యారేజ్ వాయిదా పడటంతో బాబు బంగారం యూనిట్ రిలీజ్ డేట్ను ముందుకు తీసుకువచ్చారు. జనతా గ్యారేజ్ రిలీజ్ అవుతుందనుకున్న ఆగస్టు 12న బాబు బంగారం రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement