అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్న వెంకీ | Babu Bangaram Movie Teaser | Sakshi
Sakshi News home page

అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్న వెంకీ

Jun 6 2016 10:30 AM | Updated on Sep 27 2018 8:49 PM

అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్న వెంకీ - Sakshi

అయ్యో అయ్యో అయ్యయ్యో అంటున్న వెంకీ

పేరులోనే విక్టరీని సొంతం చేసుకున్న హీరో వెంకటేష్. తన కెరీర్లోన బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన బొబ్బిలి రాజా చిత్రంలో వెంకీ 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అంటూ కామెడీని పండించిన విషయం తెలిసిందే.

పేరులోనే విక్టరీని సొంతం చేసుకున్న హీరో వెంకటేష్. తన కెరీర్లోన బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన బొబ్బిలి రాజా చిత్రంలో వెంకీ 'అయ్యో అయ్యో అయ్యయ్యో' అంటూ  కామెడీని పండించిన విషయం తెలిసిందే. ఆ ఊతపదం కూడా కొన్ని సంవత్సరాల వరకూ జనాల నోళ్లలో బాగా నానింది. మరోసారి ఆ ఊతపదంతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మారుతి దర్శకత్వం వహించిన అతడి తాజా చిత్రం 'బాబు బంగారం' టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో అతడు ఓ కామెడీ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. టీజర్లో.... మదర్ థెరిస్సా మళ్లీ పుట్టి పోలీస్ డ్రస్‌  వేస్తే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ అనే డైలాగ్తో వెంకీ పాత్రను చెప్పకనే చెప్పారు. ఇక టీజర్లో హీరోయిన్ నయన్తార, వెంకటేష్ జంట కనువిందు చేస్తోంది.

గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ పోలీస్ సినిమాలోని పాత్ర తరహాలోనే బాబు బంగారం సినిమాలోనూ కామెడీ పోలీస్ గా కనిపించనున్నాడు వెంకీ. అందుకు తగ్గట్టుగా ఫిట్ బాడీతో ఘర్షణ సినిమాలో కనిపించినట్టుగా ఈ సినిమాలో కూడా కనిపించాడు. తన గత సినిమాలతో పోలిస్తే ఈ ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.

అలాగే యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయటంలో మారుతికి కూడా మంచి రికార్డ్ ఉంది. దీంతో బాబు బంగారం సినిమాతో వెంకీకి మరో హిట్ ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తీసుకుని వెంక‌టేష్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవ‌ర నాగ వంశి, పీడీవీ ప్ర‌సాద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement