హీరోయిన్ ప్రేమలో బాబిసింహా | Babisinha in love | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ప్రేమలో బాబిసింహా

Jul 16 2015 9:02 AM | Updated on Sep 3 2017 5:33 AM

హీరోయిన్ ప్రేమలో బాబిసింహా

హీరోయిన్ ప్రేమలో బాబిసింహా

హీరోయిన్ ప్రేమలో బాబిసింహా అనగానే ఇదేదో సినిమా ప్రేమ కథ అనుకుంటురారేమో’అలాంటిదేమీ కాదు. ఇది రీల్ లవ్ కాదు రియల్ లవ్

చెన్నై: 'హీరోయిన్ ప్రేమలో బాబిసింహా' అనగానే ఇదేదో సినిమా ప్రేమ కథ అనుకుంటురారేమో’అలాంటిదేమీ కాదు. ఇది రీల్ లవ్ కాదు రియల్ లవ్ అనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. దీని పూర్వాపరాలేమిటో చూద్దామా పిజ్జాతో రంగప్రవేశం చేసి జిగర్‌తండ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నటుడు బాబిసింహా. జిగర్‌తండ చిత్రంలో విలక్షణ విలనీయంతో చిత్ర విజయానికి కారణం అనిపించుకున్న ఈయన ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు. బాబిసంహా నటించిన ఉరుమీన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
 
కథ ఇక్కడి వరకూ మామూలుగానే ఉంది కదూ... అయితే ఉరుమీన్ చిత్రంలో హీరోయిన్ రేష్మీమీనన్. ప్రస్తుతం రేష్మీ, బాబీ ప్రేమలో మునిగితేలుతున్నారన్నదే చర్చనీయాంశ విషయం. తమ ప్రేమకు పెద్దల సమ్మత అనంతరం తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని బాబిసింహా ప్రయత్నిస్తునట్లు సమాచారం.

 

బాబిసింహా,రేష్మీమీనన్‌ల తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను బాబిసింహా మిత్రుడు, పిజ్జా, జిగర్‌తండ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన భుజస్కంధాలపైన వేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ ప్రేమ జంటకు పెద్దల అంగీకారం లభించకపోయినా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే బాబీ మాత్రం ఇదంతా వద ంతి అంటూ కొట్టిపారేయడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement