breaking news
real love
-
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్‌స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్‌గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్‌హిట్ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
ప్రేమ కోసం వెతికా.. చివరికి...
సినీ నటి రేణూ దేశాయ్ ఆ మధ్య రెండో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో.. ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ‘ జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకూ ఓ తోడు అవసరం’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ విషయంలో ఆమె ఓ ఫోటోతో హింట్ ఇచ్చారన్న చర్చ మొదలైంది. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. పైగా దానికింద ఆమె ఓ కవిత కూడా రాశారు... ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. దీంతో ఆమెకు కావాల్సిన తోడు దొరికిందా? ఆమె కాబోయే భర్తే అతనేనా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు చాలా మంది ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణూ దేశాయ్ మాత్రం స్పందించలేదు. -
ఇదొక గొప్ప ప్రేమకథ
వారిద్దరూ దివ్యాంగులు. ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరు నడవలేరు. కానీ ఒకరికొకరు చేదోడు-వాదోడుగా ఉంటూ 29 ఏళ్లుగా దాంపత్య జీవనాన్ని సాగిస్తున్నారు. నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్న ఆ దంపతులే.. కావో షుకాయ్.. షు హౌబి. చైనాలోని చాంగ్కింగ్ ప్రాంతంలో యాంగాన్ గ్రామానికి చెందినవారు. కావో షుకాయ్ పాక్షికంగా అంధుడు. ఆయన భార్య హౌబి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆధారంలేనిది నడువలేదు. భార్య ఎక్కడికైనా వెళ్లాలన్నా.. షుకావ్ తన వీపుపై మోసుకెళ్తాడు. ఆమెను ఒక బుట్టలో పెట్టుకొని.. ఆ బుట్టను భుజాన వేసుకొని.. బయటకు తీసుకెళ్తాడు. వీరి అరుదైన ప్రేమకథ ఇప్పుడు నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. షుకాయ్ రైతు. తన ఇంటికి సమీపంలో ఉన్న భూమిలో పంటలు పండిస్తూ ఉంటాడు. ఇంటి పనిలో వ్యవసాయ పనుల్లో షుకాయ్కు హౌబి అండగా ఉంటుంది. వీరిద్దరి మధ్య పరిచయం ఆసక్తికరంగా చోటుచేసుకుంది. హౌబి సోదరిమణులు షుకాయ్ మేనత్తకు తెలిసినవారు. వారి ద్వారా ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మనసులు ముడిపడటంతో పెళ్లి చేసుకున్నారు. 29 ఏళ్లుగా వీరి వైవాహిక అనుబంధం కొనసాగుతోంది. 'నాకు ఏం కావాలన్నా హౌబిపై ఆధారపడతాను. అన్ని వేళల నన్ను మోసుకెళ్లడం అతనికి అంతగా వీలుపడదు. అందుకే ఆహార పదార్థాలు సహా నాకు ఏం కావాలన్నా ముందు తెచ్చిపెడతాడు. నేను ఇళ్లు కదలకుండా చూసుకుంటాడు' అని హౌబి చెప్తారు. 'మా చుట్టూ ఉన్నవాళ్లు మా మీద జోకులు వేస్తారు. 24 గంటలు ఒకరి కోసం ఒకరై బతికే మీలాంటి దంపతులను ఎక్కడ చూడలేదంటారు' అని షుకావ్ తెలిపారు. -
హీరోయిన్ ప్రేమలో బాబిసింహా
చెన్నై: 'హీరోయిన్ ప్రేమలో బాబిసింహా' అనగానే ఇదేదో సినిమా ప్రేమ కథ అనుకుంటురారేమో’అలాంటిదేమీ కాదు. ఇది రీల్ లవ్ కాదు రియల్ లవ్ అనే ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. దీని పూర్వాపరాలేమిటో చూద్దామా పిజ్జాతో రంగప్రవేశం చేసి జిగర్తండ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుని అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న నటుడు బాబిసింహా. జిగర్తండ చిత్రంలో విలక్షణ విలనీయంతో చిత్ర విజయానికి కారణం అనిపించుకున్న ఈయన ఇప్పుడు హీరోగా ఎదుగుతున్నారు. బాబిసంహా నటించిన ఉరుమీన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కథ ఇక్కడి వరకూ మామూలుగానే ఉంది కదూ... అయితే ఉరుమీన్ చిత్రంలో హీరోయిన్ రేష్మీమీనన్. ప్రస్తుతం రేష్మీ, బాబీ ప్రేమలో మునిగితేలుతున్నారన్నదే చర్చనీయాంశ విషయం. తమ ప్రేమకు పెద్దల సమ్మత అనంతరం తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని బాబిసింహా ప్రయత్నిస్తునట్లు సమాచారం. బాబిసింహా,రేష్మీమీనన్ల తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యతను బాబిసింహా మిత్రుడు, పిజ్జా, జిగర్తండ చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తన భుజస్కంధాలపైన వేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ ప్రేమ జంటకు పెద్దల అంగీకారం లభించకపోయినా పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే బాబీ మాత్రం ఇదంతా వద ంతి అంటూ కొట్టిపారేయడం గమనార్హం. -
హైటెక్ లవ్
రియల్ లవ్, హైటెక్ లవ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తూ రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ లవ్’. శ్రీ శివసాయి ఫిలిమ్స్ పతాకంపై వెంకటరెడ్డి నంది స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరణ్, అభిలాష్, వేణునాథ్, సాయికిరణ్, వృషాలి, ప్రేక్షా పటేల్, భారతి తదితరులు ఇందులో ముఖ్యతారలు. డిసెంబర్లో తొలి షెడ్యూలు చేశామని, త్వరలో మరో షెడ్యూలు చేస్తామని దర్శక నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: సురేష్, కెమెరా: డి.యాదగిరి.