ప్రేమ కోసం వెతికా.. చివరికి...

Renu Desai Found Real Love with Mysterious Hand - Sakshi

సినీ నటి రేణూ దేశాయ్‌ ఆ మధ్య రెండో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్‌ ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో.. ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ‘ జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకూ ఓ తోడు అవసరం’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ విషయంలో ఆమె ఓ ఫోటోతో హింట్‌ ఇచ్చారన్న చర్చ మొదలైంది. 

ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేశారు. పైగా దానికింద ఆమె ఓ కవిత కూడా రాశారు... ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. 

దీంతో ఆమెకు కావాల్సిన తోడు దొరికిందా? ఆమె కాబోయే భర్తే అతనేనా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు చాలా మంది ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణూ దేశాయ్‌ మాత్రం స్పందించలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top