ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..! | Baahubali Prabhas to shoot for 2 films simultaneously | Sakshi
Sakshi News home page

ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!

May 2 2017 2:02 PM | Updated on Sep 5 2017 10:13 AM

ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!

ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!

బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో

బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను ప్రారంభించాడు. టీజర్ కోసం కొద్ది రోజుల షూటింగ్ కూడా చేసిన యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రభాస్ హాలీడే ట్రిప్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధా కృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహోతో పాటు రాధాకృష్ణన్ సినిమా షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొనేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement