2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం | baahubali 2 trailer Run Time revealed | Sakshi
Sakshi News home page

2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం

Mar 15 2017 10:26 AM | Updated on Jul 14 2019 4:05 PM

2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం - Sakshi

2 నిమిషాల 20 సెకన్ల అద్భుతం

తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది. వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న

తెలుగు తెర మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2కు కౌంట్ డౌన్ మొదలైంది. వరుస పోస్టర్లతో సందడి చేస్తున్న బాహుబలి టీం గురువారం ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్.. ట్రైలర్ మీద అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఫుల్ ట్రైలర్ కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ను దాదాపు 300ల థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తూ.. బాహుబలి 2కు సంబంధించి మరో అప్ డేట్ అభిమానులను ఖుషీ చేస్తోంది.

సాధారణంగా తెలుగు సినిమాకు ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం లెంగ్త్ ఉండే ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటారు. కానీ బాహుబలి 2 మాత్రం అభిమానులకు మరింత వినోదాన్ని పంచనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ట్రైలర్ను కూడా అదే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల తరహాలో 2 నిమిషాల 20 సెకన్లు ఉండేలా ట్రైలర్ను డిజైన్ చేశారు. ఇప్పటికే ట్రైలర్కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బోర్డ్ సభ్యులు ఈ ట్రైలర్ కు యుఎ సర్టిఫికేట్ జారీ చేశారు.

సినిమా గ్రాండియర్తో పాటు క్యారెక్టర్స్, పోరాట సన్నివేశాలు ఇలా అన్ని అంశాలకు సంబంధించిన హింట్స్ను ట్రైలర్లో పొందుపరిచారన్న టాక్ వినిపిస్తోంది. ముంబైలో జరిగే భారీ ఈవెంట్లో హిందీ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. అలాగే గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ను ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్లో బాహుబలి 2 ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం గురువారం సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement