బాహుబలి 2 : భారత్లోనే 1000 కోట్లు | Baahubali 2 Collection Record | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 : భారత్లోనే 1000 కోట్లు

May 12 2017 4:26 PM | Updated on Sep 5 2017 11:00 AM

బాహుబలి 2 : భారత్లోనే 1000 కోట్లు

బాహుబలి 2 : భారత్లోనే 1000 కోట్లు

సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్నా బాహుబలి 2 రికార్డ్లు వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇండియన్

సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్నా బాహుబలి 2 రికార్డ్లు వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేసిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ దూసుకెళుతుంది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా అవతరించింది బాహుబలి.

తాజాగా 14 రోజుల్లో కేవలం భారత్ లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి చరిత్ర సృష్టించింది. ఇప్పట్లో ఏ భారతీయ సినిమా ఈ రికార్డును అందుకోవటం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. భారత్లో తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అయిన బాహుబలి రెండు వారాల్లో 1020 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి వసూళ్లు 1300 కోట్లకు చేరువలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement