మళ్లీ సినిమా చేస్తాం | Ayushmann Khurrana to collaborate with Sriram Raghavan again | Sakshi
Sakshi News home page

మళ్లీ సినిమా చేస్తాం

Aug 31 2019 6:01 AM | Updated on Aug 31 2019 9:37 AM

Ayushmann Khurrana to collaborate with Sriram Raghavan again - Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా

దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్, హీరో ఆయుష్మాన్‌ ఖురానా కాంబినేషన్‌లో వచ్చిన అంధాధూన్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఆయుష్మాన్‌కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులు కూడా పొందింది ఈ సినిమా. శ్రీరామ్, ఆయుష్మాన్‌ కాంబినేషన్‌లో మళ్లీ ఓ సినిమా రానుందట. దానికి సంబంధించిన కథ కూడా తయారు చేశారట శ్రీరామ్‌ రాఘవన్‌. ‘స్క్రిప్ట్‌ రీడింగ్‌ సెషన్స్‌ జరపడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు ఆయుష్మాన్‌.  ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్‌ అన్నీ పూర్తయ్యాక మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది’ అని పేర్కొన్నారు శ్రీరామ్‌ రాఘవన్‌.

Advertisement
 
Advertisement
Advertisement