ఏయ్ పిల్లా...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్ దాస్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా..’ అనే పాట టీజర్‌ను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. తాజాగా ‘ఏయ్ పిల్లా..’ పూర్తి పాటను, లిరికల్ వీడియోను ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటింది. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంతో పవన్ సీహెచ్ సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి