మీడియాపై ప్రీతీ జింటా రుసరుస.. | Sakshi
Sakshi News home page

మీడియాపై ప్రీతీ జింటా రుసరుస..

Published Tue, Oct 21 2014 12:33 AM

మీడియాపై  ప్రీతీ జింటా  రుసరుస..

మాజీ బాయ్‌ఫ్రెండ్ నెస్ వాడియాపై పెట్టిన కేసు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రీతీ జింటా రుసరుసలాడింది. ‘ఆ విషయాన్ని పోలీసులనే అడగండి’ అంటూ దూకుడుగా బదులిచ్చింది.
 
 నెస్ వాడియా తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ ప్రీతీజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ఆ కేసు విషయమై ప్రశ్నించడంతో సహనం కోల్పోయింది. అంతా తనను సెలిబ్రిటీగా పిలుస్తున్నా, తానూ మామూలు మనిషినేనని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పింది.

Advertisement
 
Advertisement
 
Advertisement