తోడా అడ్రా చక్క అంటున్న ఆర్యన్ రాజేష్ | aryan rajesh's thoda adra chakka new movie | Sakshi
Sakshi News home page

తోడా అడ్రా చక్క అంటున్న ఆర్యన్ రాజేష్

Oct 25 2013 4:14 AM | Updated on Aug 28 2018 4:30 PM

తోడా అడ్రా చక్క అంటున్న ఆర్యన్ రాజేష్ - Sakshi

తోడా అడ్రా చక్క అంటున్న ఆర్యన్ రాజేష్

టాలీవుడ్ నటుడు ఆర్యన్ రాజేష్ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన ఇంతకు ముందు దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన ఆల్బమ్ తదితర చిత్రాల్లో నటించారు.

టాలీవుడ్ నటుడు ఆర్యన్ రాజేష్ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన ఇంతకు ముందు దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన ఆల్బమ్ తదితర చిత్రాల్లో నటించారు. తాజాగా తోడా అడ్రా చక్కా చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని ఎ.భూమిజా సినిమా పతాకంపై నిర్మాత డి.రమేష్‌బాబు, డి.ప్రవీణ నిర్మిస్తున్నారు. మోనికాసింగ్, ఇషా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో గంజాకరుప్పు, సెండ్రయన్, శివ సుబ్రమణ్యం, సుమన్‌శెట్టి, రాజీవ్ కనకాల, వాసు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కీలక పాత్రలో దర్శకుడు శివశంకర్ నటిస్తున్నారు.
 
  శ్రీకర్‌బాబు కథ, కథనం, ఛాయాగ్రహణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ప్రేమ, హాస్యంతో కూడిన సస్పెన్స్ కథాంశంతో రూపొందుతోందన్నారు. డ్రామా కంపెనీ నడిపే శివశంకర్ మాస్టర్ వద్ద టాటా, బిర్లా, రాయల్ అనే ముగ్గురు పని చేస్తుంటారని తెలిపారు. వారికి అనూహ్యంగా కోటి రూపాయలు లభిస్తాయన్నారు. వారికా డబ్బు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ తర్వాత వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తదితర ఆసక్తికరమైన అంశాల సమాహారమే చిత్ర కథ అని చెప్పారు.
 
  ఇందులో టాటా బిర్లాలుగా ఆర్యన్ రాజేష్ , వాసు నటిస్తున్నారని తెలిపారు. రాజీవ్ కనకాల విలన్‌గా నటిస్తున్నారని పేర్కొన్నారు. గంజాకరుప్పు తొలిసారిగా పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారని, చిత్రంలోని రెండు పాటలను మలేషియా, దుబాయ్‌లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement