సందనదేవన్ గా ఆర్య | Arya as sandanadevan | Sakshi
Sakshi News home page

సందనదేవన్ గా ఆర్య

Dec 24 2016 1:48 AM | Updated on Sep 4 2017 11:26 PM

సందనదేవన్ గా ఆర్య

సందనదేవన్ గా ఆర్య

నటుడు ఆర్య 1980 కాల యువకుడిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారు.

నటుడు ఆర్య 1980 కాల యువకుడిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇంతకు ముందు 1947కు ముందు తెల్లదొర పాలనలో భారతీయ యువకుడిగా మదరాసు పట్టణం చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కంబన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదీ పిరియడ్‌ కథా చిత్రమే అని సమాచారం. దీని తరువాత అమీర్‌ దర్శకత్వంలో సందనదేవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. జయంరవి హీరోగా ఆదిభగవాన్  చిత్రం తరువాత దర్శకుడు అమీర్‌ మరో చిత్రం చేయలేదు. మధ్యలో ఆయన హీరోగా పేరన్భు కొండ పెరియోర్‌గళే చిత్రం మొదలెట్టారు. అయితే అది ఫైనాన్సియల్‌ సమస్య కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత శింబు కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అదీ వార్తలకే పరిమితమైంది.ఇప్పుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి అమీర్‌ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం.

ఇందులో ఆర్య 1980 నాటి మధురై యువకుడిగా నటించనున్నారట.ఆ కాలంలోని ఒక క్రీడాయోధుడిగా ఆర్య నటించనున్నారట.అందు కోసం ఆర్య తన శారీరక భాషను మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా ఐశ్వర్యారాజేశ్‌ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నాయకిగా పట్టాదారి చిత్రం ఫేమ్‌ అతిథిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆర్య కదంబన్ చిత్రాన్ని పూర్తి చేసి అమీర్‌ దర్శకత్వంలో సందనదేవన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement