విలన్‌గా యమ క్రేజ్ | arvind swamy Villain role in Jayam Ravi movie | Sakshi
Sakshi News home page

విలన్‌గా యమ క్రేజ్

Dec 11 2015 1:27 AM | Updated on Sep 3 2017 1:47 PM

విలన్‌గా యమ క్రేజ్

విలన్‌గా యమ క్రేజ్

మణిరత్నం ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ హీరోగా అందరికీ దగ్గరైన అరవింద్ స్వామి

మణిరత్నం ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ హీరోగా అందరికీ దగ్గరైన అరవింద్ స్వామి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి బిజీ. ఆయన విలన్‌గా, ‘జయం’ రవి హీరోగా నటించిన లేటేస్ట్ తమిళ హిట్ ‘తని ఒరువన్’ తాజాగా రామ్‌చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అరవిందే విలన్ పాత్రధారి. ఇలా ఉండగా, తమిళంలో ఇప్పుడు అరవింద్‌స్వామి, ‘జయం’ రవి కాంబినేషన్‌కు భలే క్రేజ్ ఉంది. ‘రోమియో-జూలియట్’ తమిళ చిత్ర దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో మళ్ళీ వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మళ్ళీ విలన్, హీరోలుగా చేస్తున్నారట!
 

Advertisement
 
Advertisement
Advertisement