కాలా షూటింగ్‌లో అరుళ్‌దాస్‌కు గాయాలు | Aruldas injuries in kala shooting | Sakshi
Sakshi News home page

కాలా షూటింగ్‌లో నటుడికి గాయాలు

Aug 25 2017 8:47 AM | Updated on Sep 17 2017 5:55 PM

కాలా షూటింగ్‌లో అరుళ్‌దాస్‌కు గాయాలు

కాలా షూటింగ్‌లో అరుళ్‌దాస్‌కు గాయాలు

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కాలా చిత్ర షూటింగ్‌లో విపత్తు నెలకొంది.

తమిళసినిమా:  రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కాలా చిత్ర షూటింగ్‌లో విపత్తు నెలకొంది. నటుడు అరుళ్‌దాస్‌ కాలికి తీవ్రగాయాలయ్యాయి. నాన్‌మహాన్‌ అల్ల, పాపనాశం, నీర్‌పార్వవై, చతురంగం చిత్రాల్లో వివిధ తరహా పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు అరుళ్‌దాస్‌. ఈయన కాలా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై పూందమల్లి ప్రాంతంలో ముంబయిలోని ధారావి ప్రాంతాన్ని తలపించే విధంగా భారీ సెట్‌ను వేసి షూటింగ్‌ నిర్వహిస్తున్నారు.

బుధవారం నటుడు అరుళ్‌దాస్‌పై సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌లో జీప్‌ అనూహ్యంగా అరుళ్‌దాస్‌ వైపు దూసుకురావడంతో ఆయన కాలుపై ఎక్కేసింది. దీంతో అరుళ్‌దాస్‌ కాలి వేళ్లు నలిగిపోయాయి. దీంతో వెంటనే ఆయన్ని చిత్ర యూనిట్‌ సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు అరుళ్‌దాస్‌ కాలి వేళ్లు మూడు పాక్షికంగా విరిగాయని, ఆయనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement