కిల్లర్‌ రియల్‌ సక్సెస్‌ | Arjun Speech at Killer Movie Success Meet | Sakshi
Sakshi News home page

కిల్లర్‌ రియల్‌ సక్సెస్‌

Jun 15 2019 12:17 AM | Updated on Jun 15 2019 12:17 AM

Arjun Speech at Killer Movie Success Meet - Sakshi

అంజయ్య, విజయ్‌ ఆంటోని, అర్జున్, ఆషిమా నర్వాల్, సైమన్, ఆండ్రూ

‘‘ఇప్పుడు సినిమాలు హిట్‌ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్‌’ చిత్రం రియల్‌ సక్సెస్‌ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్‌ అన్నారు. విజయ్‌ ఆంటోని, అర్జున్‌ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్‌’. ఇందులో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌కుమార్, టి.శ్రీధర్‌ ఈ చిత్రాన్ని ‘కిల్లర్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి ‘కిల్లర్‌’ సినిమాతో నిరూపితమైంది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో అర్జున్‌గారు నటించడం మా ప్రధానబలం. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. ‘‘దాదాపు 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు.

ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణగారికి కృతజ్ఞతలు. ‘కిల్లర్‌’ చిత్రం బాగా ఆడుతోంది. రెండోవారంలో 60థియేటర్స్‌ పెరగడం ఈ సినిమా విజయానికి సంకేతం. విజయ్‌ ఆంటోనీ, ఆండ్రూస్‌ బాగా చేశారు’’ అన్నారు అర్జున్‌. ‘‘విజయ్‌ ఆంటోని వల్లే ఈ అవకాశం వచ్చింది. అర్జున్‌గారు నటించడం హైలైట్‌. ఈ సినిమా సక్సెస్‌లో మా టీమ్‌ కీలకం’’ అన్నారు ఆండ్రూ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంజయ్య, ప్రదీప్, కథానాయిక ఆషిమా నర్వాల్, నటి భానుశ్రీ, సంగీత దర్శకుడు సైమన్‌ కింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement