మన అర్జున్‌రెడ్డియే... వర్మగా మారాడు!

Arjun Reddy's Tamil Remake Will Be Called Varma - Sakshi

అదెలా కుదురుంది? ఎక్కడైనా ఒక్కటే పేరు ఉంటుంది కదా! మరి, ‘అర్జున్‌రెడ్డి’ వర్మగా ఎలా మారాడు? అనుకోవద్దు! రీమేక్‌ సినిమాల్లో హీరోలు మారినప్పుడు, టైటిల్స్‌ కూడా మారతాయి కదా! విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ తెలుగులో ట్రెండ్‌ సెట్టింగ్‌ హిట్‌. ఆ టైటిలే ఓ ట్రేడ్‌ మార్క్‌ సింబల్‌గా మారింది. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రీమేక్‌కి ‘వర్మ’ అనే టైటిల్‌ కన్ఫర్మ్‌ చేశారు. ప్రస్తుతం ధృవ్‌ క్యారెక్టర్‌కి తగ్గట్టు లుక్‌ని మార్చుకునే పనిలో ఉన్నారట! వన్స్‌... లుక్‌ ఫైనలైజ్‌ చేసిన తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారట! విక్రమ్‌ని ‘సేతు’తో స్టార్‌ చేసిన దర్శకుడు బాలాయే. ఆయన ధృవ్‌కి ఎలాంటి హిట్‌ ఇస్తారోనని విక్రమ్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Back to Top