షాక్‌  అయ్యా! | AR Rahman breaks silence on Me Too | Sakshi
Sakshi News home page

షాక్‌  అయ్యా!

Oct 24 2018 12:54 AM | Updated on Oct 24 2018 12:54 AM

AR Rahman breaks silence on Me Too - Sakshi

‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖులపై వస్తున్న ఆరోపణలు చాలామందికి షాకింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ రచయిత వైరముత్తు గురించి గాయని చిన్మయి పోస్ట్‌ చేసిన ఆరోపణలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. కాస్టింగ్‌ కౌచ్‌ నటీమణులకే కాదు.. సింగింగ్‌ విభాగంలోనూ ఎక్కువే అని ఈ ఆరోపణలు స్పష్టం చేశాయి. ఈ ‘మీటూ’ ఉద్యమంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నాను.

ఇందులో వచ్చిన కొందరి బాధితులు, నిందితుల పేర్లు విని షాక్‌ అయ్యాను. మహిళలను గౌరవిస్తూ, వాళ్లు ఏ సమస్యలు లేకుండా ఇండస్ట్రీ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ప్రతిభను నిరూపించుకోవడమే కాకుండా, మెరుగుపరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరాణాన్ని కల్పించాలని నేను, నా బృందం మరింత ధృడంగా నిర్ణయించుకున్నాం. బాధితులు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించడానికి సోషల్‌ మీడియా మంచి వేదికగా మారింది. కానీ ఇంటర్‌నెట్‌ జడ్జ్‌మెంట్‌ సిస్టమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు దీన్ని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉంది’’ అన్నారు రెహమాన్‌. 

Advertisement
 
Advertisement
Advertisement