అప్పూ గురి తప్పదు! | Appu movie will Release shrotly | Sakshi
Sakshi News home page

అప్పూ గురి తప్పదు!

Jul 25 2017 1:03 AM | Updated on Sep 5 2017 4:47 PM

అప్పూ గురి తప్పదు!

అప్పూ గురి తప్పదు!

చదువులోనైనా... చురుగ్గా వ్యవరించడం లోనైనా అప్పూ గురి తప్పదు! అంత తెలివై నోడు కాబట్టే 8 ఏళ్ల వయసులో ఏనుగును చూడాలని ఇంటి నుంచి ఒంటరిగా బయట అడుగు పెట్టినోడు క్షేమంగా ఇంటికొస్తాడు.

చదువులోనైనా... చురుగ్గా వ్యవరించడం లోనైనా అప్పూ గురి తప్పదు! అంత తెలివై నోడు కాబట్టే 8 ఏళ్ల వయసులో ఏనుగును చూడాలని ఇంటి నుంచి ఒంటరిగా బయట అడుగు పెట్టినోడు క్షేమంగా ఇంటికొస్తాడు. ఈ మధ్యలో అప్పూ ఏం చేశాడనేది తెరపై చూపిస్తామంటున్నారు దర్శక–నిర్మాత కె. మోహన్‌. మాస్టర్‌ సాయి శ్రీవంత్‌ టైటిల్‌ రోల్‌లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల సినిమా c

జాకీ, లోహిత్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ లభించింది. చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె. మోహన్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది?’’ అనే çకథతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. బాలతారలుగా సుమిత్‌ జాషు, సాయి అభిషేక్, లాస్య, మేఘన, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం తదితరులు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement