క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాజమౌళి! | Apologies.. I said Stalin instead of Tagore yesterday in alluduseenu audio launch | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాజమౌళి!

Jun 30 2014 4:24 PM | Updated on Sep 2 2017 9:36 AM

క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాజమౌళి!

క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాజమౌళి!

సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో క్షమాపణలు చెప్పారు. అల్లుడు శీను ఆడియో కార్యక్రమంలో 'నేను టాగోర్ కు బదులు స్టాలిన్ అన్నాను'. మన్నించండి అంటూ రాజమౌళి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.  
 
'అల్లుడు శీను' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. వీవీ వినాయక్ ఎమోషనల్ పర్సన్. పేపర్లో వార్తలకే కంటతడి పెడ్డారని.. స్టాలిన్ చిత్రానికి కష్టపడిన దానికన్నా వినాయక్ ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డారని రాజమౌళి అన్నారు. చిరంజీవి నటించిన టాగోర్ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 
 
టాగోర్ అనడానికి బదులు స్టాలిన్ అని చెప్పడంపై రాజమౌళి ట్విటర్ లో వివరణ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement