చిన్ని అపోహ | apoha movie going on post productions | Sakshi
Sakshi News home page

చిన్ని అపోహ

Jul 1 2019 12:52 AM | Updated on Jul 1 2019 12:55 AM

apoha movie going on post productions - Sakshi

మేఘనాచౌదరి

‘‘ఈ విశ్వంలో మానవ సృష్టి అత్యంత కీలకమైనది. ప్రేమ, పెళ్లి, శోభనం.. అన్నీ విజయవంతంగా జరగాలి. పెళ్లి తర్వాత ఓ చిన్న అపోహతో భార్యాభర్త మధ్య ఎలాంటి ఎడబాటు ఎదురవుతుంది? అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది?’’ అన్నది మా ‘అపోహ’ సినిమా కథాంశం అని దర్శక–నిర్మాత కులదీప్‌ అన్నారు.

కులదీప్, స్వాతినాయుడు, మేఘనాచౌదరి ముఖ్య పాత్రల్లో కళాదీపిక సినీ క్రియేషన్స్‌ పతాకంపై కులదీప్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కులదీప్‌ మాట్లాడుతూ– ‘‘గొప్ప ఎమోషనల్‌ ఫీలింగ్స్‌తో రూపుదిద్దుకున్న చిత్రమిది. ప్రతి యువతీ, యువకులు మా సినిమా చూసి, అపోహలను పూర్తిగా తొలగించుకునేలా ఉంటుంది. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లి, సంగీతం: అర్జున్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement