మంచి టీమ్‌ కుదిరితేనే అది సాధ్యం – అనుష్క | Anushka Speech at Bhaagamathie Movie Sucess Meet | Sakshi
Sakshi News home page

మంచి టీమ్‌ కుదిరితేనే అది సాధ్యం – అనుష్క

Feb 1 2018 12:54 AM | Updated on Feb 1 2018 12:54 AM

Anushka Speech at Bhaagamathie Movie Sucess Meet  - Sakshi

అశోక్, ప్రమోద్, వంశీ, అనుష్క, విక్కీ, తమన్‌

‘అరుంధతి, రుద్రమదేవి’ చిత్రాలకు అనుష్క ఎంత ఎఫర్ట్‌ పెట్టి పని చేశారో ‘భాగమతి’కి కూడా అంతే కష్టపడ్డారు. అందుకు తనకు హ్యాట్సాఫ్‌. ఈ సినిమా పాయింట్‌ను నమ్మి అశోక్‌ ఇన్నేళ్లు ట్రావెల్‌ చేశాడు. తన నమ్మకం ఈరోజు నిజమైంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో అశోక్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘భాగమతి’ హిట్‌తో కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వంశీ, ప్రమోద్, విక్కీలను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది.

నేను ఆరేళ్లలో ఐదు హిట్స్‌ కొట్టినట్లే, యు.వి. క్రియేషన్స్‌పై ఆరేళ్లలో ఐదు హిట్స్‌ సాధించారు’’ అన్నారు. ‘‘భాగమతి’ విడుదలైన రోజు నుంచి నేటి వరకు పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు బాగా చేస్తున్నావని చాలామంది అంటుంటారు. ఒక మంచి బ్యానర్, టీమ్‌ కుదిరినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘ఇది సక్సెస్‌మీట్‌ కాదు.. సక్సెస్‌ఫుల్‌ ప్రయాణం. 2012లో స్టార్ట్‌ చేసిన జర్నీ ఇది. అçప్పటి నిర్ణయం సరైనదని ఈరోజు రుజువైంది. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా అనుష్క, నిర్మాతలకే చెందుతుంది’’ అన్నారు అశోక్‌. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, తమన్, ప్రభాస్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement