కేదార్‌నాథ్‌ యాత్రలో భాగమతి.. | Anushka Shetty in Kedarnath dham tour | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌ యాత్రలో భాగమతి..

May 3 2018 6:30 PM | Updated on May 3 2018 8:49 PM

Anushka Shetty in Kedarnath dham tour - Sakshi

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో భారీ సక్సెస్‌లు అందుకున్నారు నటి అనుష్క శెట్టి. ఇటీవల భాగమతి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క లేడి ఓరియెంటెడ్‌ చిత్రాల్లో తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పారు. పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇటీవల స్వీటీ కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. కాలినడకన ధామానికి చేరుకున్నఆమె అక్కడ కొలువైన మహాశివుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో గుర్రం స‌హాయంతో 17 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించారు అనుష్క. ఇద్దరు సభ్యులతో కలిసి వెళ్లిన అనుష్క.. కేదార్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే కేదార్‌నాథ్‌లో అనుష్కని చూసిన కొంద‌రు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీప‌డ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement