అవేమీ లేకపోయినా హ్యాపీగానే..

అవేమీ లేకపోయినా హ్యాపీగానే..


ఇప్పుడు నేను పొందినవన్నీ లేకపోయినా చాలా సంతోషంగా ఉండేదాన్ని అన్నారు నటి అనుష్క. దీనిబట్టి చూస్తే సాధించానన్న గర్వం, ఏదో పోగొట్టుకున్నానన్న వైరాగ్యం స్పష్టంగా తెలుస్తోంది కదూ’ఈ యోగా సుందరి తన గతాన్ని తరచూ గుర్తు చేసుకుంటున్నారు. అగ్ర నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో ఏలుతున్నా ఏదో అసంతృప్తి వెంటాడుతున్నట్లు ఆమె మాటల్లో తొంగిచూస్తోందనిపిస్తోంది. నటి గా పుష్కర కాలంలోకి ప్రవేశించిన అనుష్క మనోగతం ఏమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. నా నటజీవితం పదేళ్లు దాటింది.

 

 చిన్నప్పుడు ఇతర ప్రదేశాలకు వెళ్లితే అక్కడి పరిస్థితులు నచ్చేవి కావు. ఎప్పుడు ఇంటికి పారిపోదామా అని అనిపించేది. సినిమాకు వచ్చిన కొత్తలోనూ అలాంటి భావనే. సినీ రంగప్రవేశానికి ముందు నాది చాలా చిన్ని లోకం.చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. టీవీ చూడడం, స్నేహితులతో గడపడం, పుస్తకాలు చదువుకోవడం ఇదే అప్పట్లో నా దిన చర్య. సినిమాలోకి వచ్చిన తరువాత అంతా తలక్రిందులైపోయింది. వెళ్లే ప్రదేశాల్లో జనం. ఆటోగ్రాఫ్ లంటూ అభిమానుల గోల,  షూటింగ్‌లు.

 

  అంతస్తు ఇలా నా జీవితమే మారిపోయింది. ఇవన్నీ లేకపోయినా నా జీవితం సంతోషంగానే ఉండేది. సినిమా నా జీవితాన్ని వం ద శాతం మార్చేసింది. చాలా మంది స్నేహితులయ్యారు. ఎన్నో దేశాలు చు ట్టొచ్చాను. అభినందనలు, కీర్తి, ఇలా శిఖరానికి చేర్చింది సినిమా. అయితే ఇవేవీ నాకు తలకెక్కలేదు. ఇంటికి వెళి తే అన్నీ మర్చిపోయి ఒక సాధార ణ అమ్మాయిగా మసలుకుంటాను. సిని మాలో చాలా మంది స్నేహితులున్నా రు. వారంతా నాకు సొంతం అయిపోయారు. సినిమా నాకు చాలా నేర్పిం ది. తమిళం, తెలుగు భాషల్లో ప్రము ఖ నటిగా రాణిస్తున్నాను. నటన కు ప్రాముఖ్యత ఉన్న పా త్రలు అమరుతున్నాయి. ఇది చా లా సంతోషాన్నిస్తోంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top