
అనుష్కా శర్మ
‘‘సక్సెస్, డబ్బు, ఫేమ్, పవర్ అన్నీ మన కష్టార్జితాలే. కానీ పవర్ మాత్రం కేవలం మన స్వలాభం కోసం కాదు’’ అంటున్నారు అనుష్కా శర్మ. మన దగ్గరున్న పవర్‌ని ఎలా వాడుకోవాలనే విషయం గురించి అనుష్క మాట్లాడుతూ – ‘‘మన దగ్గర ఏదైనా పవర్ ఉందంటే.. దాన్ని ఉపయోగించి వేరే వాళ్ల జీవితాలను ఇంకా బాగు చేయడం కోసమే అని నమ్ముతాను.
పవర్ అనేది మనల్ని మనం సంతృప్తిపరచుకోవడమో లేదా మనం మిగతా వారందరికంటే గొప్ప అని ఫీల్ అవ్వడమో కాదు. వాళ్ల లైఫ్‌ని ఇంకా సుఖమయం చేయడం. నా పొజిషన్‌ని ఉపయోగించి ఒక యానిమల్ షెల్టర్ స్టార్ట్ చేశాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చాడంటే కేవలం మనకోసం కాదు. మన ద్వారా మంచి జరగాలన్నది ఆయన ఆకాంక్ష అయ్యుండొచ్చని నా ఫీలింగ్. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే మన దగ్గర ఉన్న పవర్‌కి నిజమైన అర్థం ఉంటుంది’’ అన్నారు.