షాక్ ఇస్తోన్న అనుష్క లుక్..! | Anushka Sharma is unrecognisable in Pari Poster | Sakshi
Sakshi News home page

షాక్ ఇస్తోన్న అనుష్క లుక్..!

Jun 13 2017 12:07 PM | Updated on Sep 5 2017 1:31 PM

షాక్ ఇస్తోన్న అనుష్క లుక్..!

షాక్ ఇస్తోన్న అనుష్క లుక్..!

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కొత్త సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమవుతోంది. పారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కొత్త సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమవుతోంది. పారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రోసిత్ రాయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముంబై, కోల్కతాలలో షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా పారి అంటూ డిస్నీ వారి కార్టూన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. పెద్ద కళ్లు, చుట్టూ మెరుపులతో ఉంటే యువరాణి పారి. కానీ అనుష్క శర్మ పారి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

భయానకంగా ఉన్న అనుష్క లుక్స్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. తాను స్వయంగా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మరోసారి చాలెంజింగ్ రోల్లో అలరించనుంది అనుష్క. ఇప్పటికే ఎన్హెచ్ 10, ఫిల్లౌరి లాంటి విభిన్న చిత్రాలతో నిర్మాతగానూ ఆకట్టుకున్న అనుష్క శర్మ, మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement