‘ఆ సినిమా నా జీవితాన్ని నాశనం చేసింది’

Anurag Kashyap Shocking Comments On Gangs Of Wasseypur - Sakshi

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున తన జీవితం నాశనమైందని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అన్నాడు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మనోజ్‌ బాజ్‌పేయ్‌, రిచా చద్దా, రీమాసేన్‌ తదితర తారాగణంతో తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌’ తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా అనురాగ్‌ కశ్యప్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. బొగ్గు మాఫియా అక్రమాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులు తనను చూసే విధానం మారిందని కశ్యప్‌ పేర్కొన్నాడు.

ఈ మూవీ మొదటి భాగం విడుదలై ఏడేళ్లు పూర్తైన సందర్భంగా...‘  ఏడేళ్ల క్రితం సరిగ్గా ఈరోజునే నా జీవితం పూర్తిగా నాశనమైంది. అప్పటి నుంచి ప్రేక్షకులు నా నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నారు. కానీ నేను వారి అంచనాలను అందుకోలేకపోతున్నాను. ఏదైతేనేం 2019 నాటికి సాడే సాతీ పూరైంది’ అంటూ అనురాగ్‌ కశ్యప్‌ చమత్కరించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశాడు. కాగా గత కొంతకాలంగా అనురాగ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్‌మర్జియాన్‌’  ప్రేక్షకులను నిరాశపరిచింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top