రామ్కు జోడి కుదిరింది..! | anupama Parameswaran with Ram | Sakshi
Sakshi News home page

రామ్కు జోడి కుదిరింది..!

Mar 26 2017 11:04 AM | Updated on Sep 5 2017 7:09 AM

రామ్కు జోడి కుదిరింది..!

రామ్కు జోడి కుదిరింది..!

హైపర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ త్వరలోనే మరో సినిమాను ప్రారంభించనున్నాడు. నేను శైలజ

హైపర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ త్వరలోనే మరో సినిమాను ప్రారంభించనున్నాడు. నేను శైలజ సక్సెస్ తరువాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న రామ్, మరోసారి కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ నెల 29న ఈసినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ ప్రస్తుతం నటీనటుల ఎంపిక చేస్తోంది. రామ్ సరనస హీరోయిన్ గా ఇప్పటికే మేగా ఆకాష్ ను ఫైనల్ చేయగా.. తాజాగా లీడ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ను ఫైనల్ చేసింది. టాలీవుడ్ లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తున్న అనుపమా, రామ్ కు కూడా సక్సెస్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement