మూడు సినిమాలు ఒప్పేసుకుంది | Anu Emmanuel Movie Offers in Tollywood | Sakshi
Sakshi News home page

మూడు సినిమాలు ఒప్పేసుకుంది

Jul 17 2016 1:59 PM | Updated on Sep 4 2017 5:07 AM

మూడు సినిమాలు ఒప్పేసుకుంది

మూడు సినిమాలు ఒప్పేసుకుంది

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలకు కలిసొస్తుంది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు కొత్త భామలు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అయితే ఓ మళయాలి...

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భామలకు కలిసొస్తుంది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు కొత్త భామలు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. అయితే ఓ మళయాలి ముద్దుగుమ్మ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే వరుస సినిమాలకు సైన్ చేసేస్తోంది.

ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అవుతోంది అను. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకె చెప్పేసింది ఈ బ్యూటి. ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కబోయే సినిమాకు సైన్ చేసిన అను, మరో యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి నటించేందుకు అంగీకరించింది.

దొంగాట ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో రాజ్ తరుణ్తో కలిసి ఆడిపాడేందుకు ఓకె చెప్పింది. మళయాల సినిమా 'యాక్షన్ హీరో బిజు'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయల్, ఇప్పుడు టాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement