చాన్స్‌లకు కొదవ లేదు! | Anu Emmanuel Clarity On Her Movie Chances | Sakshi
Sakshi News home page

చాన్స్‌లకు కొదవ లేదు!

Jul 30 2018 8:03 AM | Updated on Aug 29 2018 5:43 PM

Anu Emmanuel Clarity On Her Movie Chances - Sakshi

తమిళసినిమా: అవకాశాలకేం కొదవ లేదు అంటోంది నటి అనుఇమ్మానువేల్‌. అమెరికాకు చెందిన ఈ 21 ఏళ్ల పరువాల భామ 2011లోనే కథానాయకిగా మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. అక్కడ రెండు చిత్రాలు చేయగానే టాలీవుడ్‌ నుంచి కాలింగ్‌ వచ్చింది. అక్కడ తొలి చిత్రం మజ్ను మంచి విజయాన్ని అందించడంతో అమ్మడు అక్కడే సెటిల్‌ అయిపోయింది.ఆ మధ్య విశాల్‌ తకు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చినా, అనుఇమ్మానువేల్‌ను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. మొత్తం మీద ఈ ఎనిమిదేళ్లలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కలిపి 8 చిత్రాలే చేసింది. అయితే గ్లామర్‌ విషయంలో ఎల్లలు లేవన్నట్టుగా నటించడానికి రెడీ అంటున్నా ఎందుకో అంత క్రేజ్‌ రాలేదు. ఇటీవల అల్లుఅర్జున్‌తో రొమాన్స్‌ చేసిన నా పేరు సూర్య చిత్రంపై అనుఇమ్మానువేల్‌ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆది ఆశించిన విజయం సాధించకపోవడం ఈ బ్యూటీ కెరీర్‌కు పెద్ద దెబ్బే అని చెప్పకతప్పదు.

ప్రస్తుతం తెలుగులో ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. ఇతర భాషల్లో అ ఒక్కటి కూడా లేదు. అవకాశాలు తగ్గి పోయాయే అన్న ప్రశ్నకు ఈ బ్యూటీ ఏ మంటుందో చూద్దాం. నాకు అవకాశాలు రావడం లేదు అని అంటున్నారు. అది కరెక్ట్‌ కాదు. నిజానికి  నాకు అవకాశాలకు కొదవ లేదు. అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోవడం లేదు. నటనకు అవకాశం ఉన్న మంచి అవకాశాలనే అంగీకరిస్తున్నాను. నటనలో ఎదగాలి.మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి అన్న ఆసక్తి నాలో ఉంది. అందుకే అవకాశాల కోసం ఆతృత పడడం లేదు. ఒకే సమయంలో నాలుగైదు చిత్రాలు చేసేయాలని కోరుకోవడం లేదు. ఒక్క చిత్రం చేసినా అది పేరు తెచ్చి పెట్టేదిగా ఉండాలని ఆశిస్తున్నాను. అలాంటి చిత్రాలే నన్నిక్కడ పది కాలాల పాటు నిలబెడతాయి. కొందరు చిత్రం తరువాత చిత్రం చేస్తుంటారు. నాదీ అదే పాలసీ. ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తరువాతే మరో చిత్రం ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యకు జంటగా ఒక చిత్రం చేయడానికి అంగీకరించాను.  

Advertisement
 
Advertisement
Advertisement