అంతర్వేది టు అమలాపురం | antharvedi to amalapuram shooting special for titanic movie | Sakshi
Sakshi News home page

అంతర్వేది టు అమలాపురం

May 5 2016 1:05 AM | Updated on Sep 3 2017 11:24 PM

అంతర్వేది టు అమలాపురం

అంతర్వేది టు అమలాపురం

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ సీడీ ఆవిష్కరించారు. దర్శకుడు ఎన్. శంకర్ పాటల సీడీ విడుదల చేసి, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్‌కు అందించారు.

దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. గోదావరి నదిలో టైటానిక్ లాంచీలో ఏం జరిగిందన్నదే కథ. థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా నటించారు’’ అని తెలిపారు. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, కల్యాణ్ కృష్ణ, బెల్లం రామకృష్ణా రెడ్డి, రాజీవ్ సాలూరి, సంగీతదర్శకుడు కోటి, సహ నిర్మాత అట్లూరి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement