
దక్షిణాదిలో గ్రాండ్ రిలీజ్
హాలీవుడ్ చిత్రాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వస్తోంది అన్నాబెల్లె క్రియేషన్ చిత్రం.
హాలీవుడ్ చిత్రాలను ఆసక్తిగా చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి వస్తోంది అన్నాబెల్లె క్రియేషన్ చిత్రం. ఈ చిత్రానికి చాలా విశేషాలున్నాయి. 2014లో వచ్చిన అన్నాబెల్లె చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ల అమెరికన్ డాలర్ల వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల వరుసలో నిలిచింది.
ది కంజూరింగ్ సిరీస్ చిత్రాలు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ది కంజూరిగ్ చిత్రానికి నాలుగవ భాగంగా వస్తున్న చిత్రం అన్నాబెల్లె క్రియేషన్. 2014లో వచ్చిన అన్నాబెల్లె చిత్రం ఒక్క భారతదేశంలోనే రూ. 83.5 కోట్లను వసూలు చేసి రికార్డు సాధించింది. ఆ చిత్ర దర్శకుడు డేవిడ్ ఎఫ్.శాండ్‌బెరిగన్నే తాజా చిత్రం అన్నాబెల్లె క్రియేషన్ కు దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 18న ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుందని చిత్ర నిర్వాహకులు వెల్లడించారు.