తగ్గానండి! | Anjali plays a cop in Madhavan-Anushka Shetty starrer Nishabdam | Sakshi
Sakshi News home page

తగ్గానండి!

Jun 30 2019 5:46 AM | Updated on Jun 30 2019 5:46 AM

Anjali plays a cop in Madhavan-Anushka Shetty starrer Nishabdam - Sakshi

అంజలి

అమెరికా పోలీసాఫీసర్ల చట్టాలను బాగా స్టడీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయి అంజలి. అక్కడి చట్టాలతో ఇక్కడి అమ్మాయికి పనేంటా అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు.. ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో అమెరికన్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య పాత్రలుగా ‘నిశ్శబ్దం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలే ఓ పాటను కూడా చిత్రీకరించారు.

మాధవన్, అనుష్కలపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బధిర యువతి (చెవుడు, మూగ) పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఇటీవలే అంజలిపై కొన్ని సన్నివేశాలను షూట్‌ చేయడం జరిగింది. ఈ చిత్రంలో చేస్తున్న పోలీసాఫీసర్‌ పాత్ర కోసం ఆమె ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు. అంతే కాదండోయ్‌... కెరీర్‌లో అంజలి తొలిసారి పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘నిశ్శబ్దం’ సినిమాలో యూఎస్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా పోలీసుల బాడీ లాంగ్వేజ్, వారి చట్టాల గురించి స్పెషల్‌ కోర్స్‌ తీసుకున్నాను’’ అన్నారు అంజలి.

Advertisement
 
Advertisement
Advertisement